మెగా మల్టీస్టారర్ లో రవితేజ..?

రాం చరణ్, ఎ.టి.ఆర్ కలిసి చేస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా అక్టోబర్ నుండి మొదలవనుందని తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న ఈ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ కాకుండా మరో హీరో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ హీరో ఎవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ అంటున్నారు.

టచ్ చేసి చూడు ప్రమోషన్స్ లో రవితేజ కూడా మల్టీస్టారర్స్ కు రెడీ అనడం.. రాజమౌళి మల్టీస్టారర్ సినిమా దృష్టిలో పెట్టుకునే అంటూ చెబుతున్నారు. రాజమౌళి డైరక్షన్ లో విక్రమార్కుడు సినిమా చేసిన రవితేజ త్వరలోనే మళ్లీ తనతో సినిమా ఉంటుందని అన్నాడు. అంటే ఈ లెక్కన ఆ మెగా మల్టీస్టారర్ లో 3వ హీరో రవితేజనే అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఇక మరో పక్క ఆ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బన్ని, చరణ్, తారక్ అబ్బో ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇక సినిమా రేంజ్ ఏంటో ఊహించలేం. మరి అసలు కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది రాజమౌళి అండ్ టీం రివీల్ చేస్తేనే కాని తెలియదు.