మాస్ వర్సెస్ క్లాస్.. గెలిచేదెవరు..!

సంక్రాంతి పోటీ చప్పగా సాగడంతో ఆ తర్వాత వచ్చిన భాగమతి సిని ప్రేక్షకుల దాహం తీర్చింది. అయితే ఈరోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు మంచి క్రేజ్ తో వస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడుగా వస్తున్నాడు. ఇక యువ హీరో నాగశౌర్య ఓన్ ప్రొడక్షన్ లో ఛలో అంటూ వచ్చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి.

అయితే రవితేజ టచ్ చేసి చూడు మాస్ అంశాలతో వస్తుండగా.. ఛలో సినిమా పక్కా క్లాస్ సినిమాగా వస్తుంది. మాస్ వర్సెస్ క్లాస్ సినిమాల పోటీలో ఎవరు నెగ్గే అవకాశాలున్నాయో చూడాలి. ఈ రెండు సినిమాలు డెబ్యూ డైరక్టర్స్ తీయడం విశేషం. రవితేజ సినిమా కన్నా ఛలో సినిమాకే ఎక్కువ పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఛలో ప్రమోషన్స్ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు.

టచ్ చేసి చూడు ప్రమోషన్స్ కూడా అంతగా చేయట్లేదు. ఈ టైంలో ప్రమోషన్స్ బాగా చేస్తేనే సినిమాకు ఆడియెన్స్ ను తీసుకొచ్చేది. మరి రవితేజ సినిమాకు ఎందుకు అంతగా ప్రమోట్ చేయట్లేదు అన్నది తెలియదు. ఇక ఈ మాస్ క్లాస్ ఫైట్ లో ఎవరు గెలిచారు అన్నది సాయంత్రం తెలుస్తుంది. ఇప్పటికే ఛలో ప్రీమియర్స్ తో హిట్ టాక్ వచ్చింది. టచ్ చేసి చూడి అసలు టాక్ ఏంటో తెలియాల్సి ఉంది.