
సూపర్ స్టార్ మహేష్ తో జోడి కట్టే అవకాశం వచ్చింది అంటే స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్టే. అలాంటి క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది పూజా హెగ్దె. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినా అంతగా పాపులర్ కాని ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాలో బికినితో తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యంతో పాటుగా నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తుంది పూజా.
ఈ రెండు సినిమాలతో పాటుగా పూజా హెగ్దె మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందట. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ 25వ సినిమాగా రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ గా పూజాకే ఓటేశారు. సమంతకు మ్యారేజ్ కావడం.. రకుల్ కాస్త వెనక్కి తగ్గడంతో పూజా ఫాం కొనసాగిస్తుంది. వెంట వెంటనే ఓ రెండు హిట్ సినిమాలు పడితే పూజా కెరియర్ టాలీవుడ్ లో మరింత స్ట్రాంగ్ అయినట్టే.