ఎక్కడున్నాయ్ మల్టీస్టారర్ కథలు..!

రాజా ది గ్రేట్ తో ఫాంలోకి వచ్చిన రవితేజ రేపు టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్టీస్టారర్ సినిమాలపై తన అభిప్రాయాన్ని చెప్పేశాడు రవితేజ. మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు మీరు సిద్ధమా అంటే.. ఎక్కడున్నాయ్ మల్టీస్టారర్ కథలు.. మంచి కథతో వస్తే ఏ హీరోతో అయినా తాను మల్టీస్టారర్ తీసేందుకు సిద్ధమే అంటున్నాడు రవితేజ.

ఇండస్ట్రీలో అందరు స్నేహితులే కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తా.. కాని కథలే రావట్లేదని అంటున్నాడు రవితేజ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రాలేదని.. ఊపిరి గురించి ప్రస్థావించడం మాఏసి ఇప్పుడిప్పుడే మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైందని అన్నారు రవితేజ. ఇక సినిమా విషయానికొస్తే విక్రం సిరికొండ డైరక్షన్ లో వస్తున్న టచ్ చేసి చూడు మాస్ మహరాజ్ ఆడియెన్స్ కు పక్కా నచ్చేస్తుందని చెబుతున్నారు. మరి ఫలితం ఏంటన్నది మరో రోజు వెయిట్ చేస్తే సరిపోతుంది.