నానికి రాజమౌళి మార్క్ చురక..!

స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడని తెలిసిందే. నాని సినిమా అంటే హిట్ గ్యారెంటీ అన్నట్టు ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్. ఇక ఇదే విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళి ప్రస్థావించారు. నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న అ! సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని గురించి రాజమౌళి మాట్లాడారు. 

నాని సినిమా అంటే హిట్ అని ఆడియెన్స్ లో ఓ ఫీలింగ్ వచ్చేసిందని. అయితే నాని సినిమాలు చేస్తున్నాడు హిట్లు కొడుతున్నాడు అంతా బాగుంది కాని ఏదో వెళ్తి అనిపిస్తుంది అన్నట్టుగా రాజమౌళి మాటల్లో అర్ధం కనబడింది. ఈమధ్య నాని హిట్లు కొడుతున్నా రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అన్న టాక్ వచ్చింది. నానితో పోటీగా వచ్చే సినిమాల్లో మ్యాటర్ లేకపోవడం.. థియేటర్ లో కూర్చున్నంత సేపు నచ్చేయడంతో నాని వరుస హిట్లు కొడుతున్నాడు. అయితే రాజమౌళి మాటల్లోని అర్ధం ఏంటి అంటే కచ్చితంగా నాని డిఫరెంట్ సినిమాలు చేయాని చురక అంటించాడని అనుకుంటున్నారు.