నాని అ! ట్రైలర్ మ్యాటర్ ఉన్నట్టుంది..!

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా అ!. భారీ స్టార్ కాస్ట్ తో ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ హీరోలా కాకుండా నిర్మాతగా మాట్లాడాడు నాని. తానొక సినిమా తీస్తే కాని తెలియలేదు నిర్మాతగా ఎంత కష్టమో అని అన్నాడు నాని. ఇక ఈ సందర్భంగా తన నిర్మాతలందరి మీద రెస్పెక్ట్ ఇంకాస్త పెరిగిందని చెప్పాడు.

ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన నాని సినిమా కచ్చితంగా ఆడియెన్స్ అందరిని థ్రిల్ అయ్యేలా చేస్తుందని అన్నాడు. నిర్మాతగా తనకు ఇది మొదటి సినిమా అని చెప్పడంలో గర్వంగా ఉందని. ప్రశాంత్ వర్మ తన దగ్గరకు కేవలం వాయిస్ ఓవర్ కోసం రాగా సినిమా కథ నచ్చి నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పానని అన్నాడు నాని. 

ఇక సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి ఇలా అందరు సినిమాకు ప్రాణం పోశారు. ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న సినిమా ఫస్ట్ కాపీ చూసిన నాని ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడట. మరి ఇదే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందో లేదో చూడాలి.