
యువ హీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ ప్రస్తుతం కిరాక్ పార్టీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. శరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. చందు మొండేటి డైలాగ్స్ రాస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ లో నిఖిల్ యూత్ ఫుల్ గా కనిపిస్తూనే మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు.
నిఖిల్ మాస్ ఫాలోయింగ్ చేస్తున్న ప్రయత్నంగా వస్తున్న ఈ కిరాక్ పార్టీ కన్నద సూపర్ హిట్ సినిమా కిర్రిక్ పార్టీకి రీమేక్. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. అసలైతే ఫిబ్రవరి 9న రిలీజ్ ప్లాన్ చేసినా మెగా హీరోల సినిమాలు ఉండటంతో సినిమా వాయిదా వేశారని తెలుస్తుంది. టీజర్ లో నిఖిల్ లుక్ ఇంప్రెస్ చేయగా సినిమా నిఖిల్ కోరుకునే మాస్ ఫాలోయింగ్ తెస్తుందో లేదో చూడాలి.