
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ హీరోగా సినిమా ఈరోజు ముహుర్తం పెట్టారు. వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేయబోతున్నాడు. మాళవిక నాయర్, మేఘా ఆకాష్ లు హీరోయిన్స్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ముహుర్తపు షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టగా.. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్తగా మెగా ఫ్యామిలీలో ఒకటైన కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం మెగా హీరోల లిస్ట్ మరింత పెరిగేలా చేసింది. ఎంతమంది వచ్చినా మెగా అభిమానుల సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో కళ్యాణ్ ను కూడా హీరోగా నిలబెడతారనే అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు కెమెరామన్ గా సెంథిల్ కుమార్ చేస్తున్నాడు. రాజమౌళి సినిమాలు మాత్రమే చేసే సెంథిల్ చాలా కాలం తర్వాత బయట డైరక్టర్ సినిమా చేస్తున్నాడు. మరి చిరు అల్లుడిగా కళ్యాణ్ దేవ్ ఎలాంటి కెరియర్ కొనసాగిస్తాడో చూడాలి.