మలయాళ భామతో రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ టచ్ చేసి చూడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమా షురూ చేశాడు రవితేజ. శ్రీను వైట్ల డైరక్షన్ లో తన తర్వాత సినిమా చేస్తున్న రవితేజ సినిమాలో ట్రిపుల్ రోల్ లో అలరిస్తాడని తెలుస్తుంది. అమర్ అక్బర్ ఆంథోని టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ నివేదా థామస్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ వెంకీ, దుబాయ్ శీను సినిమాల్లానే హిట్ కొడుతుందని అంటున్నారు. డిఫరెంట్ కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమాలో రవితేజ క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది.

జై లవ కుశ తర్వాత నివేధా థామస్ నటిస్తున్న ఈ సినిమా ఆమె కెరియర్ కు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మలయాళ భామలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మరి రవితేజ నివేదా థామన్స్ పెయిర్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.