మలయాళ సినిమా మొదలు పెట్టిన రానా..!

బాహుబలి సినిమాతో విలన్ పాత్రలో కూడా అదరగొట్టిన రానా దగ్గుబాటి హీరోగా.. విలన్ గా తనకు ఎవరు సాటి లేరని నిరూపించుకున్నాడు. అయితే ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే రానా ట్రావెన్ కోర్ రాజ్ మార్తండ వర్మ జీవిత కథలో నటిస్తున్నాడు. 18వ శతాబ్ధంలో జరిగిన కథతో కె.మధు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో షూటింగ్ మొదలు పెట్టారు.    

తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో సినిమాలు చేస్తున్న రానా మొదటిసారి మలయాళ సినిమాలో నటిస్తున్నాడు. చరిత్ర ఆధారంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గా కూడా మార్తండ వర్మ అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సౌత్ భాషలన్నిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా 2018 చివరి కల్లా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం రానా 1945, హాథీ మేరీ సాథి సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత అంతటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రానా ఈ సినిమాతో ఏ రేంజ్ కు వెళ్తాడో చూడాలి.