చిరు మాట పక్కన పెట్టాడా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమా అంటే చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ కచ్చితంగా ఉంటుంది. కథ విన్న దగ్గర నుండి సినిమా రిలీజ్ దాకా చిరు ఇంపుట్స్ చాలా ఇస్తుంటాడు. తన అనుభవాన్ని అంతా తనయుడి సినిమా మీద పెట్టేస్తుంటాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం రంగస్థలం సినిమా మీద కూడా చిరు కన్ను పడిందట. సినిమా రషెష్ మొత్తం చూసి కొన్ని చోట్ల రీషూట్ అవసరమని చెప్పాడట.

అయితే చరణ్ మాత్రం సుకుమార్ సినిమాకు ఓ లెక్క ఉంటుందని వారించాడట. అంతేకాదు చిరు మాట పెడ చెవిన పెట్టాడని అంటున్నారు. ఈ విషయంలో సుకుమార్ కు చరణ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడట. రాం చరణ్ న్యూ మేకోవర్ తో వస్తున్న ఈ సిన్మా టీజర్ అంచనాలు పెంచేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఆడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి చిరు మాట కాదని మరి డేర్ స్టెప్ వేస్తున్న చరణ్ రంగస్థలంతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.