
మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న సినిమా అక్టోబర్ లో మొదలు కానుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోకి అవకాశం ఇస్తున్నారట. అది కూడా యాంటీ హీరో రోల్ లో ఆ హీరో కనిపిస్తాడట. ఇప్పటికే బాహుబలితో రానాని విలన్ గా ఓ క్రేజ్ వచ్చేలా చేసిన జక్కన్న మరో హీరోని విలన్ గా మార్చే ప్లాన్ చేశాడు.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో హీరోల క్యారక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బాహుబలి తర్వాత ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మరి ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ లతో ఫైట్ చేసే ఆ హీరో ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో నిర్మిస్తారని తెలుస్తుంది.