తమన్నాకు చేదు అనుభవం..!

టాప్ హీరోయిన్స్ కేవలం సినిమాల్లోనే కాదు.. పబ్లిక్ ఫంక్షన్స్ లో కూడా కనిపించి సందడి చేస్తుంటారు. రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ జెవెలరీ షాప్ ఓపెనింగ్ కు రాగా ఆమెపై షూ విసిరి నానా హంగామా చేశాడు ఓ వ్యక్తి. రిబ్బన్ కటింగ్ అయిపోయాక బయట తన ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ రెండు మాటలు మాట్లాడుదాం అనుకున్న తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. 

ఆమె మాట్లాడుతున్న సమయంలో జనాల మధ్యలో నుండి ఓ బూటు వచ్చి తన కాళ్ల దగ్గర పడింది. షూ ఆమె మీద పడలేదు. అయితే ఆమెను టార్గెట్ చేసుకునే వేశారని గుర్తించింది. దీనితో తమన్నా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ముందు బౌన్సర్స్ ఉన్నారు కాబట్టి ఆమెకు బూటు తగల్లేదు. అయితే పోలీసులు ఆ షూ వేసిన అతన్ని కరీముద్దీన్ అని గుర్తించి స్టేషన్ కు పంపించారు. సరిగా సినిమాలు చేయట్లేదనే ఉద్దేశంతో ఆమె మీద షూ విసిరినట్టు చెప్పాడు ఆ వ్యక్తి.