మంచు విష్ణు సతీమణి కి కారు ప్రమాదం లో గాయాలు

నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు భార్య వెరొనిక కు యాక్సిడెంట్ అయింది. కారులో తనతో పాటు ఒక ఇంజనీర్ ని వెంటబెట్టుకొని, జల్ పల్లి లో ఉన్న మోహన్ బాబు గెస్ట్ హౌస్ కి వెళ్తున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఒక కారు వీరి కారుని గుద్దడంతో, ఇంజనీర్ తో సహా వెరొనిక, స్వల్ప గాయాలతో బయట పడింది.

విషయం తెల్సుకున్న మంచు వారి కుటుంబం, సంఘటనా స్థలానికి చేరుకోగా, పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, స్వల్ప గాయాలే అని తెలుసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనను పోలీసులు కేసుగా రిజిస్టర్ చేసుకున్నారు. తప్పు ఎవరిదో తెలుసుకొని పూర్తి వివరాలు తొందరలోనే బయట పెడతామని అన్నారు.