
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వి.వి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇంటిలిజెంట్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవనుంది. ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనుకున్న విధంగానే వినాయక్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రాబోతుందని టీజర్ తోనే చెప్పేయొచ్చు.
ధర్మా భాయ్ గా సాయి ధరం తేజ్ మాస్ లుక్ అదిరిపోయింది. ఇక పేదోడి ఫ్లాట్ ఫాం ధర్మా భాయ్ డాట్కాం అంటూ చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోయింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జవాన్ ఫ్లాప్ అన్న మాట రాకున్నా మెగా హీరో ఓ రేంజ్ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. మరి ఆ హిట్టు బొమ్మ ఇదే అవుతుందని కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.