
చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో చిరు లుక్ ఎలా ఉంటుందో ఇంకా బయట పడలేదు. కనీసం కాస్టూమ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు కాని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బుడతడి సైరా పిక్స్ వైరల్ అవుతున్నాయి. సైరాలో చిరు వేసుకునే కాస్టూంస్ లో కుర్రాడు చూడముచ్చటగా ఉన్నాడు.
ఇంతకీ ఎవరా కుర్రాడు అంటే.. ఇంకెవరు సైరా డైరక్టర్ సురేందర్ రెడ్డి తనయుడని తెలుస్తుంది. అరిక్ రెడ్డి వయసు చిన్నదే అయినా కుర్రాడి స్పీడ్ మాత్రం మాములుగా లేదు. సిరా కాస్టూమ్స్ కుట్టించే పనిలో సూరి తన కొడుక్కి కూడా ఓ డ్రెస్ పట్టించేశాడు. ఆ డ్రెస్ మాయాజాలమో తెలియదు కాని కాస్టూమ్ వేసుకుని కత్తి పట్టుకుని దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.