
ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీల్లో రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ ఒకటి. శంకర్, రజిని కాంబోలో 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా మేకింగ్ వీడియోలతో సరిపెట్టిన చిత్రయూనిట్ టీజర్ జనవరి 25న రిలీజ్ అని అన్నారు. కాని ఆ డేట్ కూడా మిస్ అవడంతో ఇప్పుడు కొత్త డేట్ చెబుతున్నారు.
అయితే ఈసారి డైరక్టర్ శంకర్ 2.ఓ టీజర్ ఎప్పుడన్నది చెప్పాడు. ప్రస్తుతం టీజర్ కు సంబందించిన వర్క్ అమెరికాలో జరుగుతుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో 2.ఓ సినిమా టీజర్ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఈ టీజర్ రిలీజ్ ను హైదరాబాద్ లో జరుగనుందట. టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటారని టాక్. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న 2.ఓ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం మరో సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.