సైనికా సాంగ్ తో బన్ని సర్ ప్రైజ్..!

రిపబ్లిక్ డే సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరక్షన్ లో చేస్తున్న నా పేరు సూర్య నుండి సైనికా సాంగ్ రిలీజ్ చేశారు. దేశ సైనికులకు అంకితం ఇస్తూ ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది. విశాల్-శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రాయడం జరిగింది. సినిమా ప్రమోషన్ లో భాగమే అయినా కరెక్ట్ టైంకు కనెక్ట్ అయ్యే పాటను వదిలారు.  

నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ సోల్జర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ సాంగ్ తో మరింత హుశారెత్తేలా చేసింది. మెగా ఫ్యాన్స్ కు ఈ సమ్మర్ స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా చేస్తున్న అల్లు అర్జున్ నా పేరు సూర్యతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.