
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడని తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా భరత్ అనే నేను మహేష్ ఫస్ట్ ఓథ్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియో ఫైల్ రిలీజ్ చేశారు. భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల.. అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ వింటే మాటలు లేవని చెప్పాలి.
నిజంగానే మహేష్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న భావన వచ్చింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చిన ఈ ఆడియో ఫైల్ సినిమా టైటిల్ ను కన్ ఫాం చేయడమే కాకుండా అన్ని డౌట్లను క్లియర్ చేసింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ ఫస్ట్ ఓథ్ ఆడియో సినిమాపై మరింత అంచనాలను పెంచింది.