స్వర శిఖరం.. ఇళయరాజాకు పద్మవిభూషణ్..!

ఎన్నో వేల పాటల తన సంగీత సాగరంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ మాస్ట్రోల్ ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. సంగీతమే సర్వస్వంగా ఏళ్ల కొద్ది సంగీతమే ఆహారంగా ఉంటున్న ఇళయరాజాకు ఈ అవార్డ్ ఓ అద్భుతమైన అలంకారమే. కొన్ని దశాబ్ధాలుగా పాటకు పరిపూర్ణత ఇస్తూ సంగీతానికి కేర్ ఆర్ అడ్రెస్ గా మారారు ఇళయరాజా.

ఆయన స్వరపరచిన పాటలలో ఓ తరం మంచి అనుభూతిని పొందిందని చెప్పొచ్చు. మనసుని కదిలించే పాటలనే కాదు ఉత్సాహం, ఉల్లాసాన్నిచ్చే పాటలను అందించారు ఇళయరాజా. బాలచందర్‌.. భారతీరాజా.. విశ్వనాథ్‌.. మేటి దర్శకులు వారు కథలతో చాలెంజ్ చేస్తే.. ఆ కథలకు.. సినిమాలకు తగిన సంగీతాన్ని ఇచ్చి మరింత అందం తెచ్చేవారు ఇళయరాజా. ఆ సంగీత స్వర సాగర సంగమానికి పద్మవిభూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి సంగీత ప్రియులంతా ధన్యవాదాలు తెలుపుతున్నారు.