
పెళ్లి తర్వాత సమంత సెలెక్టెడ్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్న సమంత ఇప్పుడు తానే నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ యూ టర్న్ ను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తుంది సమంత. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా రాహుల్ రవింద్రన్ నటిస్తున్నాడట.
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవింద్ర తెలుగు, తమిళ ఆడియెన్స్ కు సుపరిచితుడే. అతన్ని హీరోగా పెట్టి సమంత యూ టర్న్ సినిమా చేస్తుంది. అందులో హీరోయిన్ గా సమంత నటిస్తుండటం విశేషం. ఇక్కడ ఎవరికి తెలియని మరో విషయం ఏంటి అంటే సమంత మొదట నటించిన తమిళ సినిమా మాస్కోవిన్ కావేరి సినిమాలో రాహుల్ రవింద్ర హీరోగా చేశాడు. ఆ తర్వాతే ఏమాయ చేసావే సినిమాలో నటించింది. మొత్తానికి యువ హీరో కెరియర్ ను యూ టర్న్ తిప్పే ప్రయత్నంలో సమంత చేస్తున్న ఈ రీమేక్ ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.