
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విక్రం సిరికొండ డైరక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), వళ్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. నిన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అసలైతే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది.
ఫిబ్రవరి 2న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు సినిమాతో కూడా హిట్ గ్యారెంటీ అంటున్నారు. సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమాలో మాస్ రాజా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడట. ఊర మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.