మేడారం సమ్మక్క సారక్క జాతర సాంగ్..!

ప్రతిభ ఉండాలే కాని ఎవరికి వారు తమ సత్తా చాటేందుకు డిజిటల్ ప్లాట్ ఫాం చాలు అని నిరూపిస్తున్నారు నేటితరం యువ కళాకారులు. తెలంగాణా సంస్కృతి సాహిత్యాలకు నిలువుటద్దాలుగా నిలిచే పాటలతో తెలంగాణా పాటను.. తెలంగాణా ఆటను సామాజిక మధ్యమాలతో హుశారెత్తించేలా చేస్తున్నారు. ముఖ్యంగా మైక్ టివి తెలంగాణా ప్రతి పండుగకు ప్రత్యేకమైన గీతాన్ని అందిస్తున్నారు. 

మంగ్లీ ఆలపిస్తున్న పాటలకు తెలంగాణా కట్టు బొట్టు అద్దుతున్నారు. బతుకమ్మ పండుగకు.. బంగారు బతుకమ్మ రావే అన్నా.. సంక్రాంతి కానుకగా దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే అంటూ సంక్రాంతి సంబరాన్ని ప్రతి ఇంటికి తెచ్చిన మంగ్లీ.. ఇప్పుడు తెలంగాణా పండుగ.. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర కానుకగా ఓ పాట పాడింది. కన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర.. జల జలా జంపన్న నది దాపున జాతర.. అంటూ సమ్మక్క సారలమ్మ జాతర గురించి పాట రిలీజ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతలను తెలీయచేస్తూ చక్కనైన సంగీత, సాహిత్యాలతో వచ్చిన ఈ పాట తెలంగాణా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. డాక్టర్ కందికొండ రాసిన ఈ పాటను.. మంగ్లీ, శిరీషా ఆలపించారు. మీనాక్షి భుజన్ సంగీతం అందించగా.. కోసానం దాము రెడ్డి డైరక్షన్ చేశారు.    

తెలంగాణా ప్రజలనే కాదు తెలుగు ప్రజలందరిని అలరిస్తున్న సమ్మక్క సారలమ్మ పాట మీకోసం..