
అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ టాక్ నుండి పర్వాలేదు అన్నట్టుగా ఈ సినిమా ఆడినా నిర్మాతగా మళ్లీ నాగార్జునకు నష్టాలే మిగిల్చిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అవగా లెక్కలు తేల్చి చుక్కలు చూసిన నాగార్జున అనూహ్యంగా ఓ కుర్రాడు వేసిన 50 లక్షల దావాకు షాక్ అయ్యాడట.
ఉత్తర భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి హలో సినిమాపై 50 లక్షల పరువు నష్టం దావా వేశాడు. అదేంటి అలా ఎందుకు వేశాడు అంటే సినిమా కథలో భాగమైన హలో సినిమాలోని నెంబర్ అతగాడిదట. సినిమాలో తన నెంబర్ ప్రమేయం లేకుండా వాడుకున్నారని. సినిమా రిలీజ్ అయ్యాక తనకు చాలా ఫోన్స్ వచ్చాయని, మెసేజ్ లు కూడా వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడట సదరు వ్యక్తి.
అసలే సినిమా నిరాశపరచిందని దిగాలుగా ఉన్న నాగార్జునకు కొత్తగా ఈ 50 లక్షల తలనొప్పి వచ్చి పడింది. మరి సినిమా యూనిట్ లో ఎవరో ఒకరి నెంబర్ పెట్టక ఇలా బయట వాళ్ల నెంబర్ అది కూడా ఎలా పర్మిషన్ లేకుండా ఎలా వాడారో హలో మేకర్స్ కే తెలియాలి.