
హాట్ యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న అనసూయ సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమాలో మంగమ్మత్త రోల్ చేస్తున్న అనసూయ కలక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ గా వస్తున్న గాయత్రి సినిమాలో కూడా నటిస్తుంది. పెళ్లైన కొత్తలో మదన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు, శ్రీయా శరణ్ తో పాటుగా నిఖిలా విమల్ కూడా సినిమాలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తుంది. ఇన్వెస్టిగేటివ్ రిపోటర్ గా అనసూయ నటిస్తుంది. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. శ్రేష్టా జయరాం గా సీరియస్ లుక్ లో కనిపించిన అనసూయ సినిమాలో మంచి రోలే దక్కించుకుందని తెలుస్తుంది. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది.