
అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పవన్ కళ్యాణ్ తనదైన స్టైలిష్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన పవన్ యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ అయ్యాడు. పవన్ సినిమా హిట్ అయితే ప్రభంజనాలే.. ఆ క్రేజ్ తోనే జనంలోకి వచ్చేశాడు పవన్ కళ్యాణ్.
తనదైన ప్రత్యేకమైన ఆలోచనలతో ఫ్యాన్స్ ను కేవలం సినిమాలతోనే కాకుండా తన ఆలోచనతో కూడా దగ్గరయ్యాడు పవన్ కళ్యాణ్. జనసేన అంటూ జనం లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇక నిన్న పొలిటికల్ టూర్ ప్రారంభించిన పవన్ ప్రెస్ మీట్ లో మాటల సందర్భంగా తన సినిమా చాప్టర్ క్లోజ్ అంటూ చెప్పుకొచ్చాడు.
నిజంగానే పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడా. లేక ఎన్నికల దాకా కామా పెట్టాడా అన్నది తెలియాల్సి ఉంది. తెర మీద పవన్ ను అభిమానించే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కూడా వెనకే ఉంటారని ఆశిస్తున్నాడు. మరి తన ఆశయ సాధనలో ఎంతమందిని సొంత అభిమానులుగా చేసుకుంటాడు. ఎంతమంది అభిమానులను దూరం చేసుకుంటాడు అన్నది చూడాలి.