
మెగా ఫ్యామిలీ నుండి వచ్చి స్టైలిష్ స్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కు చెప్పను బ్రదర్ అంటూ వచ్చిన ఎపిసోడ్ అందరికి తెలిసిందే. బన్ని వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న రేంజ్ లో ఈ గొడవ జరిగింది. ఫైనల్ గా ఎలాగోలా దానికి ఫుల్ స్టాప్ పెట్టారనుకోండి. ఇప్పుడు పవన్ క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. నిన్నటి నుండి పవన్ పొలిటికల్ టూర్ మొదలు పెట్టాడు. దీనికి మద్ధతిస్తూ ఇప్పటికే రాం చరణ్ ట్వీట్ చేయగా ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు విశెష్ అందించారు.
ఇక ఎటొచ్చి మళ్లీ ఈ మ్యాటర్ పై నోరు విప్పలేదు అల్లు అర్జున్. టైం చూసి మాట్లాడుదాం అనుకున్నాడా లేక నిజంగానే ఈ మ్యాటర్ గురించి చెప్పను బ్రదర్ అంటున్నాడా అన్నది తెలియదు కాని అల్లు అర్జున్ పవన్ పొలిటికల్ ట్రిప్ పై బన్ని రెస్పాన్స్ ఇవ్వకపోవడంపై పవన్ ఫ్యాన్స్ మళ్లీ అతన్ని టార్గెట్ చేస్తున్నారు. మరి మనసులో ఎలాంటి ఆలోచన లేనప్పుడు ఓ ట్వీట్ వేస్తే బాగుంటుంది కదా బన్ని అని కొందరు సలహాలిస్తున్నారు.