
నాచురల్ స్టార్ నానితో నిన్నుకోరి అనే సినిమా తీసి దర్శకుడిగా తన సత్తా చాటుకున్న డైరక్టర్ శివ నిర్వాణ. కథ రాసుకున్న రచయితే సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలకు నిన్నుకోరి లాంటి సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. నాని సక్సెస్ మేనియాను కంటిన్యూ చేస్తూ వచ్చిన నిన్నుకోరి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా ప్రేక్షకులను మెప్పించేలా చేశాడు శివ.
ఇక ప్రస్తుతం తన సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్న శివ నిర్వాణ ఈసారి అక్కినేని హీరో నాగ చైతన్యతో మరో లవ్ స్టొరీ తీస్తున్నాడట. ఏమాయ చేసావే సినిమా నుండి చైతుకి లవర్ బోయ్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి సినిమాలు చేస్తున్న చైతన్య శివ నిర్వాణతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. త్వరలో ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ వస్తుందని తెలుస్తుంది.