
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసింది. మొన్నామధ్య ఏపిలో సుడిగాలి పర్యటన చేసిన పవన్.. ఇప్పుడు తెలంగాణాలో రాజకీయా యాత్ర ప్రారంభించాడు. నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నుండి యాత్ర ప్రారంభించిన పవన్ ఆ తర్వాత కరీంనగర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పకనే చెప్పిన పవన్ ఇక నుండి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు ప్రకటించారు.
ఇక బాబాయ్ రాజకీయ యాత్రకు అబ్బాయి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఐయాం ఇండియన్.. ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ పవన్ పలికిన మాటలను మెసేజ్ పెట్టి వాట్ ఏ ఎనర్జిటిక్ స్టార్ట్ అంటూ ట్వీట్ చేశాడు రాం చరణ్. బాబాయ్ కు ఆల్ ది బెస్ట్ విశెష్ అంటూ ట్వీట్ చేశాడు చరణ్. తన రాజకీయాలకు చిరంజీవికి.. కుటుంబానికి ఎలాంటి సంబందం లేదని చెప్పిన పవన్ మాటలను పట్టించుకోకుండా చరణ్ జై జనసేన అంటూ ట్వీట్ చేయడం మెగా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది.