
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో తనయుడు ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా మెహబూబా. ఈ సినిమాలో నేహా శెట్టి విలన్ గా నటిస్తుంది. 1971 లో ఇండో పాక్ యుద్ధానికి సంబందించిన బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైందట. కొడుకు హీరో కాబట్టి పూరి కచ్చితంగా సినిమా బాగా చేశాడని తెలుస్తుంది.
ఇక మొదట సినిమా తన గురువు వర్మకు చూపించాడట పూరి. అయితే వర్మ సినిమాను పొగుడుతూ పూరి తీసిన సూపర్ హిట్ సినిమా పోకిరి కూడా ఈ సినిమా ముందు ఫ్లాప్ అనేశాడు. కొన్ని సన్నివేశాలు మాత్రం అదరగొట్టాయని అన్నాడు. మొత్తానికి పూరి తన కసి అంతా ఈ సినిమాతో చూపిస్తున్నాడని అనిపిస్తుంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాలి.