అర్జున్ రెడ్డి.. అదే విక్రం చేసుంటే..!

లాస్ట్ ఇయర్ వచ్చిన క్రేజీ మూవీస్ లో అర్జున్ రెడ్డి ఒకటి. దాదాపు స్టార్ హీరో సినిమా రేంజ్ కలక్షన్స్ తో సందడి చేసిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్ మాత్రమే కాదు రీమేక్ విషయంలో కూడా క్రేజీగా మారింది. తమిళ, హింది భాషల్లో అర్జున్ రెడ్డి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

తమిళ అర్జున్ రెడ్డికి వర్మ అనే టైటిల్ పెట్టగా.. బాలా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది అతనకు మొదటి సినిమా అవడం విశేషం. డెబ్యూ సినిమానే ఇలాంటి క్రేజీ మూవీని సెలెక్ట్ చేసుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఇక ఈ సినిమా తనయుడు ధ్రువ్ చేయకుంటే తానే చేసేవాడినని అంటున్నాడు విక్రం. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని ధ్రువ్ కు ఇది పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అంటున్నాడు విక్రం.