వెంకటేష్ అతన్ని పక్కన పెట్టాడా..!

విక్టరీ వెంకటేష్ గురు తర్వాత చేసిన సినిమా ఆటా నాదే వేటా నాదే. రీసెంట్ గా మొదలైన ఈ సినిమాకు అప్పుడే అడ్డంకులు వచ్చాయట. వెంకటేష్ సినిమాతో పాటుగా తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ సినిమా షూటింగ్ జరుగుతున్నా అంత సాటిస్ఫైడ్ గా లేదు అన్నది ఇన్నర్ టాక్. అదీగాక తేజ పూర్తిగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద దృష్టి పెట్టడంతో వెంకటేష్ సినిమా అటకెక్కించాలని చూస్తున్నాడట.

ఇలాంటి సంఘటనలు వెంకటేష్ సిని కెరియర్ లో ఎన్నో జరిగాయి. బాబు బంగారం, గురు తర్వాత కాస్త ట్రాక్ ఎక్కినట్టు కనిపించిన వెంకటేష్ మళ్లీ గ్యాప్ తీసుకుంటున్నాడు. మరి తేజ సినిమా ఎలాగోలా పూర్తి చేసి రిలీజ్ చేస్తారో లేక మధ్యలో ఆపేస్తారో తెలియాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదలైన తర్వాత మాత్రం తేజ ఖాళీగా ఉండే అవకాశాలు చాలా తక్కువ.