
అక్కినేని అఖిల్ హీరోగా మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అయినా రెండవ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో సినిమా అఖిల్ ను హీరోగా నిలబడేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తన 3వ సినిమా ఎనౌన్స్ మెంట్ ఈ నెల 10 కల్లా చెబుతా అని చెప్పిన అఖిల్ సైలెంట్ గా ఉన్నాడు. సత్య డైరక్షన్ లో సినిమా ఉంటుందని వార్తలు రాగా అది ఫైనల్ కాలేదు.
అయితే అఖిల్ 3వ సినిమా సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా పూర్తి కాగానే అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. ఇందుకు సంబందించిన కథా చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తుంది. అఖిల్ డైరక్టర్ రేసులో సుకుమార్, వంశీ పైడిపల్లితో పాటు కొరటాల శివ పేరు వినపడింది. అయితే ఫైనల్ గా శివనే కన్ ఫాం చేయడం విశేషం.