
అత్తారింటికి దారేది సినిమా, థియేటర్ లలో ఆడుతున్న రోజుల్లో, ఓ మూడు నాలుగు వారాల తర్వాత కొన్ని ఎక్స్ ట్రా సీన్లు జోడించిన సంగతి తెలిసిందే. సినిమాకి ఊపు తగ్గుతున్న టైం లో ఏదో ఒక ఫీట్ చేసి కలెక్షన్లు పెంచాలనే ఉద్దేశంతో కొంత మంది డైరెక్టర్ లు ఇలా చేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్, తన రీసెంట్ సినిమా అఆ కి ఆ ప్రయత్నం చేశారు.
'ఎల్లిపోకే శ్యామల' అనే పాట యూత్ లో ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకున్న నేపధ్యంలో, ఆ క్రేజ్ ని వాడుకుంటూ అదే పాటలో నితిన్ చేసే ఓ 40 సెకండ్ల డాన్సుని జోడించారు. ఈ ట్రిక్ సినిమాకి ఊతమిస్తుందనే అంచనాతో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కేవలం ఒక డాన్స్ బిట్ కోసమే సినిమాని మళ్ళీ వచ్చి చూసే జనాలు ఉంటారా అనే వాదన కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది.