యంగ్ రెబల్ స్టార్ తో దీపికా..!

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సాహో తర్వాత బాలీవుడ్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. మూడేళ్ల క్రిందటే ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పిన ప్రభాస్ ఆ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుందని టాక్. ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు బాలీవుడ్ భామలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక అందులోనూ బాలీవుడ్ సినిమా అంటే ఎందుకు కాదంటారు. అయితే దీపికా పదుకునే కాదంటే అలియా భట్ లేదా కత్రినా కైఫ్ ను ఈ ఛాన్స్ వరిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరక్టర్ ఎవరన్నది తెలియదు కాని సినిమా మాత్రం పక్కా లవ్ స్టోరీగా వస్తుందట. సాహో ముగింపుకు వస్తేనే కాని ఈ బాలీవుడ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు.