మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్.. పోస్టర్ వచ్చింది..!

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. తెలుగువారి గుండె చప్పుడు.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్.టి.ఆర్ అని అన్నారు బాలకృష్ణ. ఇక ఎన్.టి.ఆర్ జీవితంలోని ఎవరికి తెలియని విషయాలను కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ప్రస్థావిస్తామని అన్నారు.

మార్చి లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అన్నారు. ఇక ఈరోజు సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తేజ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు ఎన్.టి.ఆర్ అనే టైటిల్ నే పెట్టారు. బయోపిక్ ద్వారా తండ్రి రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని అన్నారు బాలయ్య. ఎన్.టి.ఆర్ కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఇక అంతకుముందే ఎన్.టి.ఆర్ ఘాట్ వద్దకు వచ్చి నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్.టి.ఆర్ లు వచ్చి నివాళులు అర్పించారు.