పవన్ ఇప్పటికి ఎంత రాబట్టాడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్లకు పైగా చేయగా కలక్షన్స్ లో మాత్రం ఆ దూకుడు చూపించట్లేదు. అజ్ఞాతవాసి 6 రోజులు 54 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

అంటే ఇంకా సగానికి పైగా రాబట్టాల్సి ఉంది. క్రేజీ కాంబినేషన్ అనేసరికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ప్రైజ్ తో ఈ సినిమాను కొనేశారు. ఒక్క నైజాం లోనే దిల్ రాజు ఈ సినిమాను 29 కోట్లకు కొన్నాడు. ప్రస్తుతం 10 కోట్లు మాత్రమే రాబట్టిన పవన్ అజ్ఞాతవాసి ఇంకా 20 కోట్లు రాబట్టాల్సి ఉంది. మొత్తానికి అజ్ఞాతవాసి దిల్ రాజుకి పెద్ద షాక్ ఇచ్చేలానే ఉంది. అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఓవర్ సీస్ లో మాత్రం పవన్ అజ్ఞాతవాసి సినిమా 2 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసింది.