
నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఇక సినిమాలోని మొదటి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండిటిని చూసి సినిమాకు ఓవర్ సీస్ లో భారీ క్రేజ్ వచ్చింది. నాని సినిమా ప్రతి ఒక్కటి అక్కడ కూడా హిట్ అవుతుండంటంతో ఈ సినిమా ఓవర్ సీస్ లో భారీగా కొనేశారట.
మాగ్నస్ మీడియా ఈ సినిమాను 4.14 కోట్లకు కొనేసిందని టాక్. నాని కెరియర్ లో ఈ రేంజ్ లో ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైన సినిమా ఇదే అని చెప్పాలి. నాని సరసన అనుపమ పరమేశ్వర ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. మరి ఓవర్ సీస్ లోనే ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న నాని తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంత రెచ్చిపోతాడో చూడాలి.