
స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ను స్టార్ గా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంట్రీ సినిమాతోనే సమంత, తమన్నాలతో స్క్రీన్ షేర్ చేయించిన బెల్లంకొండ సురేష్ తన ప్రతి సినిమాలో హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రస్తుతం శ్రీవాస్ డైరక్షన్ లో చేస్తున్న సాక్ష్యం సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఓంకార్ డైరక్షన్ లో ఓ సినిమా సైన్ చేశాడు శ్రీనివాస్. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం కోటి పైగా డిమాండ్ చేస్తున్న అమ్మడికి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి బెల్లంకొండ శ్రీనివాస్ కీర్తిని కన్ఫాం చేయించుకున్నాడట. మరి కీర్తి తో బెల్లంకొండ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.