
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా టీజర్ ఇటీవలె రిలీ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. టీజర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అదిరిపోయే రేంజ్ కు అమ్ముడయ్యాయట. ప్రముఖ చానెల్ జీ తెలుగు ఈ సినిమాను 15 కోట్లు పెట్టి శాటిలైట్ కొనేసిందట. బన్ని కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సరైనోడు సినిమా కూడా ఈ రేంజ్ లో శాటిలైట్ కాలేదు.
బన్ని ప్రీవియస్ మూవీ డిజె కూడా 13 కోట్లకు శాటిలైట్ అయ్యింది. మొత్తానికి సినిమా సినిమాకు స్టైలిష్ స్టార్ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. సినిమా యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్న బన్ని అంచనాలను అందుకుంటే సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది.