
దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పోకిరితో సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఇలియానా.. ఆ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇక అమ్మడి స్టార్ రేంజ్ పెరిగాక చెప్పాపెట్టకుండా బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ మొదటి సినిమా బర్ఫీ పర్వాలేదు అనిపించుకోగా ఆ తర్వాత అన్ని అరకొర అవకాశాలే అయ్యాయి. బీ టౌన్ లో దుమ్ముదులిపేద్దాం అనుకున్న ఇలియానాకు షాక్ తగిలింది.
అందుకే ఖాళీ సమయాల్లో ఓ నేస్తాన్ని వెతుక్కుంది. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చనువుగా ఉంటూ వస్తున్న అమ్మడు. అతనితో సహజీవనం చేస్తుందని అన్నారు. మొన్నామధ్య అతన్ని పెళ్లిచేసుకుందన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమాలను లైట్ తీసుకున్న ఇల్లి బేబ్ సీరియల్స్ లో నటించేందుకు ఓకే చెబుతుందట. అది బాలీవుడ్ సీరియల్స్ అవుతాయా.. లేక హాలీవుడ్ సీరియల్స్ అవుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రియాంకా చోప్రాలా అమ్మడు కూడా హాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ ఖుషి అవడం ఖాయం.