ఇన్నాళ్లకు పెళ్లి ఆలోచన వచ్చింది..!

టాలీవుడ్ లో పదేళ్ల కిందటే లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఆ తర్వాత కెరియర్ ను నాశనం చేసుకున్నాడు. దాదాపు స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఆ యువ హీరో ఈమధ్య కొంతకాలం సినిమాలకు దూరం అయ్యాడు. ఫైనల్ గా మళ్లీ తన మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో అంటే లవర్ బోయ్ తరుణ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం తరుణ్ హీరోగా వస్తున్న సినిమా ఇది నా లవ్ స్టోరీ.

ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు తరుణ్. ఇక ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో తరుణ్ మదర్ రోజా రమణి తరుణ్ పెళ్లి వార్త గురించి చెప్పింది. తరుణ్ కు అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట వారి పెద్దలు. 35 ఏళ్లు నిండినా ఇంకా పెళ్లిచేసుకోని తరుణ్ ఇప్పటికి పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన వచ్చిందట. మరి ఆ అమ్మాయి ఎవరో త్వరలో తెలుస్తుంది.