
టాలీవుడ్ లో ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఎలాంటి సినిమాలైనా సరే చాలెంజింగ్ గా చేస్తాడు. ఇప్పటికే ఊపిరి అంటూ కార్తితో మల్టీస్టారర్ ట్రై చేసిన నాగార్జున నాచురల్ స్టార్ నానితో ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నాడట. ఇక ఈ సినిమానే కాకుండా తమిళ హీరోతో మరో మల్టీస్టారర్ కు నాగార్జున సై అన్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ లో చిన్న హీరో నుండి స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు ధనుష్. రజినికాంత్ అల్లుడైనా ఎప్పుడు ఆ క్రేజ్ ను పాపులారిటీని వాడుకోని ధనుష్ సొంత టాలెంట్ తో పైకి వచ్చాడు. ప్రస్తుతం అతను సోలో హీరోగా సూపర్ ఫాంలో ఉండగా రీసెంట్ గా నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చేసేందుకు ఓకే చెప్పాడట. ప్రముఖ తమిళ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. మరి నాగార్జునతో ధనుష్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.