మహేష్ సినిమా రెస్పాన్స్ వచ్చింది..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు భరత్ అను నేను టైటిల్ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతికి వస్తుందని ఆశించినా రిలీజ్ చేయలేదు. ఇక అఫిషియల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ డేట్ చెప్పేశారు నిర్మాతలు. జనవరి 26న మహేష్ సినిమా ఫస్ట్ లుక్ రాబోతుందట. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఓథ్ (ప్రమాణ స్వీకారం) అంటూ పోస్టర్ వదిలారు.

మహేష్ తో కొరటాల శివ తీసిన శ్రీమంతుడు సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కూడా ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గదని అంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా ఏప్రిల్ నుండి జూన్ కు సినిమా వాయిదా పడిందని అంటున్నారు.