
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గేటు దూకేశాడు. అదేంటి గేటు దూకి పారిపోవాల్సిన అవసరం ఆయనకేంటి అంటే.. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ భాషల్లో తన గ్యాంగ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకోగా ప్రమోషన్స్ మాత్రం బాగా చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో సూర్య గ్యాంగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అక్కడ ఆ సినిమా ఆడే థియేటర్ కు వెళ్లగా ఊహించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రేక్షకులు వచ్చారట. దానితో షాక్ అయిన సూర్య రావడం మెయిన్ గేట్ నుండి వచ్చినా వెళ్లేప్పుడు మాత్రం వెనుక గేటుపై నుండి దూకి వెళ్లాడట. మీడియా కంట పడకున్నా సరే సెల్ ఫోన్లో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. తన సినిమా కోసం సూర్య ఈ రేంజ్ లో కష్టపడటం చూసి అందరి షాక్ అవుతున్నారు. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ నటించింది.