
కోలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తున్న మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ తెలుగులో మొదటి సినిమానే పవర్ స్టార్ త్రివిక్రం కాంబో పట్టేశాడు. అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఓకే అన్నట్టుగా ఉన్నా తెలుగు ప్రేక్షకులు మాత్రం అనిరుద్ కు మైనస్ మార్కులు వేశారు. అజ్ఞాతవాసికి దేవి అయ్యుంటే సినిమాకు ఇంకాస్త హెల్ప్ అయ్యేదని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తాడని అన్నారు.
అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ దాదాపు కోల్పోయాడని తెలుస్తుంది. అజ్ఞాతవాసికి మ్యూజిక్ పరంగా దెబ్బ పడటంతో త్రివిక్రం అనిరుద్ ను కంటిన్యూ చేసే ఆలోచన విరమించుకున్నాడట. మొత్తానికి అనిరుద్ రవిచందర్ ఓ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరిలో త్రివిక్రం ఎన్.టి.ఆర్ మూవీ మొదలవుతుందట. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమా చేస్తాడు.