
కొత్త కథలకు.. కొత్త సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు కొత్త ప్రయోగాలతో వస్తున్నారు అప్ కమింగ్ డైరక్టర్స్. పెళ్లిచూపులు తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డి సందీ వంగ ఇలా తొలి సినిమాతోనే దర్శకులుగా వారి టాలెంట్ చూపించేస్తున్నారు. ప్రస్తుతం మరో దర్శకుడు ప్రశాంత్ కుమార్ కూడా ఇలాంటి ప్రయోగంతోనే వస్తున్నాడు.
మిఠాయి సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అవాక్కయ్యేలా చేశాడు ప్రశాంత్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి) ఫేం లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తుందట. పోస్టర్ అంచనాలను పెంచగా ఈ ఇయర్ ట్రెండ్ సెట్టర్ మూవీ ఇదే అని అంటున్నారు సిని ప్రియులు. మరి అసలు కథ ఎలా ఉంటుందో ఏమో కాని గొర్రె తలకాయకు గ్రీన్ కలర్ వేసి పోస్టర్ లో క్రియేటివిటీ చూపించేశారు.