ఇద్దరూ ఇద్దరే అంటున్నారు..!

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ప్రేక్షకుల ఆలోచలను.. అంచనాలకు అందకుండా అదిరిపోయేలా మెగా నందమూరి కాంబినేషన్ లో సినిమా షురూ చేశాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ గా ఈ సినిమా వస్తుంది. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని టాక్.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఇద్దరూ ఇద్దరే అని పెట్టబోతున్నారట. ఏయన్నార్, నాగార్జున కలిసి నటించిన సినిమా కూడా ఇద్దరూ ఇద్దరే.. మళ్లీ అదే టైటిల్ తో ఈ మెగా నందమూరి సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా బాహుబలి రేంజ్ దాటి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తారట.