
సూపర్ స్టార్ మహేష్ కు మొదటి కమర్షియల్ బిగ్ సకెస్ అంటే ఒక్కడు అనే చెప్పాలి. మురారి సినిమా కమర్షియల్ గా హిట్ అయినా మహేష్ కు మాస్ ఫాలోయింగ్ తెచ్చింది మాత్రం ఒక్కడు సినిమానే. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వచ్చి ఈరోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎం.ఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా ఇక్కడ హిట్ అవడమే కాకుండా రీమేక్ అయిన తమిళ, హింది భాషల్లో కూడా సూపర్ హిట్ అందుకుంది. గుణశేఖర్ మహేష్ కాంబినేషన్ అప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మహేష్ హీరోగా సూపర్ స్టార్ గా నిలబడేలా చేయడంలో ఒక్కడు సినిమా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.