కడప కింగ్ పవనేనా?

నిర్మాత శరత్ మరార్ ఇటీవల కడప కింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ అని రెండు సినిమాలు నిర్మించిన ఈయన, ఇప్పుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో మళ్ళీ పవన్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నారు.

మొదట్లో ఇదే సినిమాకి ఈ పేరుని అనుకున్నా కూడా, కథకి సరిపోకపోవడంతో, సూర్య, పవన్ వద్దనుకున్నారు. అయితే పవన్ తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఒప్పుకున్నట్లు తెలిసిందే. కాబట్టి అదే సినిమాకి ఈ టైటిల్ పెట్టవచ్చు అని సినీ వర్గాల సమాచారం. కానీ త్రివిక్రమ్ కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీఠ వేస్తారు కాబట్టి, ఇంత మాస్ టైటిల్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైనా శరత్ గాని, త్రివిక్రమ్ గాని నోరు మెదిపే దాకా ఏ విషయం బయటికి రాదు.